మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు : కాంగ్రెస్‌ నేతకు ఈడీ నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

  • Publish Date - February 1, 2019 / 09:15 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం రేపింది. ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో కాంగ్రెస్‌ నేత వేం నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది.

ఓటుకు నోటు కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పోటీ చేశారు. వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యతో పాటు.. సెబాస్టియన్, ఉదయ్ సింహా కలిసి కుట్ర పన్నినట్లు ఏసీబీ అభియోగం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ.50 లక్షలు ముడుపులు ఇచ్చేందుకు వీరు ప్రయ్నతించారని అభియోపత్రంలో పేర్కొంది. ఈ మేరకు ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసింది. రేవంత్, సండ్ర వెంకట వీరయ్య సహా నిందితులకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.