హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు.
హైదరాబాద్‌లో వరద నీటిలో చిక్కుకున్న వృద్ధుడిని భుజాలపై మోసుకెళ్లిన ట్రాఫిక్ సీఐ నాగమల్లుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించారు. విధినిర్వహణలో సీఐ చూపిన అంకితభావం స్ఫూర్తిగా నిలవాలంటూ ట్వీట్ చేశారు. హ్యాట్సాఫ్ టు ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు గారు. విధి నిర్వహణలో మీ అంకితభావం మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ.. మీకు అభినందనలు..అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
ట్రాఫిక్ సీఐ నాగమల్లు మానవత్వాన్ని చాటుకున్నారు. భారీ వర్షం కురవడంతో ఎల్బీ నగర్ – సాగర్ రింగ్ రోడ్డుకు వెళ్లే దారిలో నీళ్లు నిలిచాయి. విధుల్లో ఉన్న నాగమల్లు వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఓ కుమారుడు స్కూటీపై తీసుకెళ్తుండగా వర్షం నీటిలో బండి ఆగిపోయింది.
నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తన వీపుపై మోస్తూ నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే… సోషల్ అవేర్‌నెస్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్న ట్రాఫిక్ సీఐ నాగమల్లుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉన్నతాధికారుల సూచనలు, వారిచ్చిన స్ఫూర్తితోనే సామాజిక సేవ చేస్తున్నానని నాగమల్లు తెలిపారు.
హాట్సాఫ్ టూ ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ అంజపల్లి నాగమల్లు గారు. విధినిర్వహణలో మీ అంకితభావం మరింతమందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ.. మీకు అభినందనలు @Rachakonda_tfc @HYDTP @cyberabadpolice @TelanganaDGP pic.twitter.com/ZrbEvTRDqg
— Harish Rao Thanneeru (@trsharish) August 31, 2019