ఒక్క చోట 64 మంది కంటే ఎక్కువ పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ : ఒక్క చోట 64 మంది కంటే ఎక్కువ పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం( మార్చి 26) మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. నిజామాబాద్ లో నామినేషన్ల పరిశీలన జరుగుతోందన్నారు. 194 సింబల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది పోటీలో ఉన్నా సింబల్స్ కేటాయిస్తామన్నారు.
శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.10 కోట్ల 66 లక్షల 58 వేల 66లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూ.2 కోట్ల 19 లక్షల 35 వేల 580 విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 543 గ్రాముల బంగారం సీజ్ చేశామని తెలిపారు.