డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకానికి వీరే అర్హులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్‌టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్‌మెంట్‌) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు.

  • Publish Date - February 27, 2020 / 10:42 AM IST

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్‌టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్‌మెంట్‌) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్‌టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్‌మెంట్‌) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ లిమిటెడ్‌ ద్వారా డ్రైవర్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాంను అమలు చేస్తున్నామని తెలిపారు. డ్రైవర్ల నైపుణ్యతను పెంచడం, ఉపాధి కల్పనకు సహకారం, వాహనాల కొనుగోలుకు ఆర్థిక సహాయం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. దీనిలో సుస్థిర ఆదాయం కల్పించడానికి ఉబేర్‌సంస్థతో ఒప్పదం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 

అర్హతలు…
*కనీసం 8వ తరగతి పాస్‌, అపై విద్యార్హత కలిగి ఉండాలి. 
*31-01-2020 వరకు వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 
*31 జనవరి 2020కి ముందు జారీ చేసిన లైట్‌ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. 
*ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించకూడదు. 
*లైట్‌మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ కలిగిన మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 
*అర్హత కలిగిన గిరిజన డ్రైవర్లు www.https://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌ పోర్టల్‌లో 15 మార్చి 2020 లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.