తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది.
తెలంగాణలో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెరపడింది. తెలంగాణలోని నిజామాబాద్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం ముగిసింది. నిజామాబాద్ లో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం కొనసాగనుంది. ఏప్రిల్ 11న తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ లో అత్యధికంగా బరిలో 185 మంది అభ్యర్థులు ఉన్నారు. మెదక్ లో అత్యల్పంగా 10 మంది అభర్థులు ఉన్నారు.
Read Also : ఏపీలో మైక్ లు బంద్…ఓటరు దేవుడు ఎవరివైపు
తెలంగాణలో మొత్తం 2 కోట్ల 97 లక్షల 8 వేల 5 వందల 99 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.49 కోట్ల మంది పురుషులు, 1.47 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 34 వేల 604 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్ ఉంటుంది. నిజామాబాద్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది.
మొత్తం 79 వేల 882 ఈవీఎంలు, 42 వేల 853 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈసారి ఎన్నికల కోసం 46 వేల 731 వీవీప్యాట్ లు వినియోగించనున్నారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మందికిపైగా సిబ్బంది పాల్గొననున్నారు.
Read Also : అమరావతిపై కేసులు వేసిన జగన్ ఓ ఉన్మాది