ప్లాస్మాతో ప్రాణదానం చేయండి.. అవగాహనతో ముందుకు రావాలి : చిరంజీవి

  • Publish Date - August 7, 2020 / 04:43 PM IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్లాస్మా దానం చేసిన పోలీసులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. కరోనా సోకకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్లాస్మా డొనేట్ చేసిన పోలీసులకు ఆయన సన్మానించారు. కరోనాను జయించి ప్లాస్మా దానం చేసిన సైబరాబాద్ పోలీసులను చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. ప్లాస్మా డొనేట్ చేసిన పోలీసులకు సైబరాబాద్ కమిషనరేట్ లో సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ప్లాస్మా డొనేట్ చేసిన పోలీసులను ఆయన సత్కరించారు.



ప్లాస్మా డొనేషన్ పై అందరిలోనూ అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్మా డొనేట్ చేయడంపై అవగాహన కల్పిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్లాస్మా దానంపై అవగాహన కల్పించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు. కరోనాపై పోరులో పోలీసులు ఫ్రంట్ లైన్ హీరోలుగా ఉన్నారని చిరంజీవి అభినందించారు.

గొప్ప సేవ చేస్తున్న పోలీసులు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివిగా కొనియాడారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా సంజీవని లాంటిదని చిరంజీవి అన్నారు. కరోనాకు మందు ఎప్పుడు వస్తుందో లేదో ఇంకా తెలియదన్నారు. కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్లాస్మా చికిత్సతో రోగులు కోలుకుంటున్నారని చెప్పారు.



కరోనాకు మందు రాని పరిస్థితుల్లో అయోమం నెలకొందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి సుమారు 30 మందికి ప్రాణదానం చేయొచ్చునని తెలిపారు. ప్రాణాలు కాపాడే గొప్ప శక్తి భగవంతుడు మనలోనే ఉంచాడని చిరంజీవి చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో యాండీబాడీస్ పెరుగుతాయని చెప్పారు. ప్లాస్మా డొనేషన్ పై ఎలాంటి అపోలొద్దన్నారు. ప్లాస్మాను డొనేట్ చేసిన 24 గంటల్లోనే తిరిగి సమకూరుతుందని చిరంజీవి స్పష్టం చేశారు. ప్లాస్మా గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు.