తెలంగాణలో ఘనంగా హోళీ సంభరాలు

  • Publish Date - March 21, 2019 / 10:14 AM IST

హోలీ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వీధుల్లో హోలికా దహనం, కామదహనం తర్వాత రంగులు చల్లుకుంటూ యువతీ యువకులు హోలీ సంబరాలను అంబరాన్ని తాకించారు. దేశంలో ఏ వీధి చూసినా హోలీ సంబరాలే. 

ఇక అహ్మదాబాద్‌ లో యువత హోళీ పండుగను టమాటాలతో సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. రసాయనాలతో చేసిన రంగుల కంటే, ప్రకృతి సిద్ధమైన టమాటాలను రంగులుగా చల్లుకుంటున్నారు. రోడ్డంతా కిలోల కొద్దీ టమాటాలను పోసి వాటి జ్యూసులతో సంబరాలు చేసుకుంటున్నారు. 
Read Also : వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్లు : డౌన్ లోడ్ చేసుకోండిలా

వరంగల్ జిల్లాలో హోలీ వేడుకలు  ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ…శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హన్మకొండ లోని పలు కాలనీల్లో చిన్నారులు, పెద్దలు హోలీ వేడుకల్లో మునిగితేలారు. వరంగల్ కమిషనరేట్ లో జరిగిన హోలీ వేడుకట్టో  సీపీ రవీందర్ పాల్గొన్నారు. ఒకరికి ఒకరు రంగులు అద్దుకుంటూ కేరింతలు వేస్తూ డాన్స్ ల మధ్య వేడుకలను నిర్వహించారు. ఇలా హోలీ వేడుకలు జారుకోవడం సంతోషంగా ఉందన్నారు సీపీ రవీందర్ అన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లో హోలీ వేడుకలు గ్రాండ్ గా కలర్ ఫుల్ గా జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లలో నగరవాసులు, యువతీయువకులు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు.. హ్యాపీ హోలీ అంటూ కేరింతలు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో యువతీయువకులు రంగులు చల్లుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో  జరిగిన  హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ దివ్య నటరాజన్ పాల్గొన్నారు.  ఓటర్స్ హోలీ పేరుతో వినూత్నంగా హోలీ సంబురాలు జరుపుకున్నారు. అంబేడ్కర్ చౌక్ లో ఓటర్స్ హోళీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచే విధంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పాల్గొన్నారు.