ఎప్ప‌టికీ అంతేనా : మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

  • Publish Date - March 28, 2019 / 09:42 AM IST

తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాహా బాహీగా కొట్టేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి  అంజన్ కుమార్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నులాడుకున్నారు..ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురింపించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతర్ధి పార్టీల నేతలు దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లాలాపేట ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు ఒకరిని మరొకరు కింద పడేసి మరీ కొట్టుకుని రచ్చ రచ్చ చేశారు. 

లాలా పేటలో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అంజన్ కుమార్. అనంతరం ఇంటింటికీ ప్రచారాన్ని చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఇద్దరు నేతల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సమావేశంలోనే కొట్టుకోవటంతో అక్కడ ఉన్న కొందరు నేతలు వారికి సర్ధి చెప్పేందుకు యత్నించినా వారు వినలేదు..సరికదా ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకున్నారు.  దీంతో సమావేశం అంతా రసాభాసాగా మారిపోయింది. కాగా పార్టీలో అంతర్గతంగా ఉన్న పోరు మరోసారి తెరపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది.