పొగరాయుళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తామంటే కుదరదు. పబ్లిక్ ప్లేసుల్లో స్టైల్ గా సిగరెట్, బీడీ తాగుతామంటే అస్సలు ఊరుకోరు. అధికారులు
పొగరాయుళ్లు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ స్మోకింగ్ చేస్తామంటే కుదరదు. పబ్లిక్ ప్లేసుల్లో స్టైల్ గా సిగరెట్, బీడీ తాగుతామంటే అస్సలు ఊరుకోరు. అధికారులు మీ తాట తీస్తారు. ఫైన్లు వేస్తారు. జైలుకి కూడా పంపుతారు. పొగరాయుళ్ల భరతం పట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందుతున్నారు. క్లాసులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ నగరాన్ని ధూమపాన రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నారు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం-2003లో వచ్చింది. ఉల్లంఘనుల ఆటకట్టించే అధికారాన్ని చట్టం 21 శాఖలకు కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య కేంద్రాల్లో స్మోకింగ్ కోసం గదులు ఉండాలని, పొగాకు ఉత్పత్తుల తయారీదారులు పాటించాల్సిన నియమాలను స్పష్టంగా చెప్పినా ఎక్కడా అమలు కావట్లేదు. దీంతో నగరంలో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉన్నతాధికారులు దశలవారీగా గ్రేటర్ అధికారులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సర్కిళ్ల స్థాయిలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. చట్టంలోని నిబంధనల గురించి వివరిస్తున్నారు. మరో రెండు విడతల్లో ట్రైనింగ్ క్లాసులు ముగుస్తాయి. ఆ తర్వాత కార్యాచరణపై పూర్తి స్పష్టత రానుందని అధికారులు తెలిపారు.
చట్టప్రకారం జరిమానాలు, జైలు శిక్షలు :
పొగాకు ఉత్పత్తులపై ప్రకటనలకు తొలిసారి: వెయ్యి రూపాయలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష
రెండోసారి పాల్పడితే: రూ.5వేలు ఫైన్, ఐదేళ్లు జైలు
మైనర్లకు ఉత్పత్తులు విక్రయిస్తే: రూ.200 ఫైన్
ప్రభుత్వం సూచించిన హెచ్చరికలు ముద్రించకుండా విక్రయిస్తే తయారీ సంస్థకు తొలిసారి: రూ.5వేలు ఫైన్, రెండేళ్లు జైలు
రెండోసారి: రూ.10వేలు ఫైన్, ఐదేళ్లు జైలు
ఇలాంటి అమ్ముతూ పట్టుబడితే విక్రయదారులకు తొలిసారి: వెయ్యి రూపాయలు ఫైన్, ఏడాది జైలు
రెండోసారి: రూ.3వేలు ఫైన్, రెండేళ్లు జైలు