హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు చిరంజీవి ఫాంహౌజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మణికొండలోని ఫాంహౌజ్‌లో సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాణం కోసం ఏర్పాటు చేసి సెట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో సెట్ తగలబడుతోంది.
ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అలాగే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పెను ప్రమాదం తప్పింది. సినిమా సెట్ దాదాపు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూ ట్ లేదా మరేదైనా కారణమా తెలియాల్సి వుంది.