నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు చెలరేగాయి.

  • Publish Date - November 29, 2019 / 12:15 PM IST

హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు చెలరేగాయి.

హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం(నవంబర్ 29, 2019) సాయంత్రం స్టేషన్ కింద ఉన్న పాత భవనంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. మెట్రో స్టేషన్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.