హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం అనుచరులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నయీం బినామీ ఆస్తులను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు యత్నించిన అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీ, అబ్దుల్ నజీర్, హసీనా బేగం, తుమ్మ శ్రీనివాస్ లను రాచకొండ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.88 లక్షల నగదు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం కొంతకాలం స్థబ్తుగా ఉండి తిరిగి వెలుగులోకొచ్చి అతని అనుచరులు.. బినామీ ఆస్తులపై కన్నేశారు. రిజస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేశారు.
కమర్షియల్ కాంప్లెక్స్, ఖాళీగా ఉండే స్థలాలను కబ్జా చేసి వారిపేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నయీం కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాచకొండ కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు. నయీంకు చెందిన ఆస్తులు ఇంకా ఎక్కడెక్క ఉన్నాయో ఇన్వెస్టిగేట్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐ వెంకన్నను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అటాచ్ చేశారు. నయీం ముఠాకు సహకరించారని పలువురు పోలీసు అధికారులపై ఆరోపణలున్న విషయం తెలిసిందే.