Gas E-Kyc: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ చేయకపోతే కనెక్షన్ కట్.. ఇదే లాస్ట్ ఛాన్స్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గ్యాస్(Gas E-Kyc) వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు సంచలన హెచ్చరిక జారీ చేస్తున్నాయి.

Gas cylinder E-kyc deadline hyderabad supply stop warning

  • ఈ-కేవైసీ చేయకపోతే గ్యాస్ బంద్
  • ఆయిల్ కంపెనీల కఠిన నిర్ణయం
  • వెంటనే ఈకేవైసీ పూర్తి చేయండి

Gas E-Kyc: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు సంచలన హెచ్చరిక జారీ చేస్తున్నాయి. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, అక్రమ కనెక్షన్లను తొలగించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో త్వరలోనే ఈ సేవలను పూర్తిగా నిలిపివేసేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో దాదాపు 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 70 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. మరోవైపు డిమాండ్‌కు తగినట్లుగా గ్యాస్ సరఫరా లేకపోవడంతో, కేవైసీ పూర్తి చేయని ఖాతాదారులకు సిలిండర్ల డెలివరీని వెంటనే నిలిపివేసేందుకు ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి.

Abhijeet Dipke: పంజాబ్ పేపర్ లీక్‌పై పోరాటం.. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం.. అభిజిత్ దీప్కే సంచలన కామెంట్స్

గడువు ఇచ్చినా నిర్లక్ష్యం:

వాస్తవానికి 2024 జూన్ నుంచే ఈ-కేవైసీ (Gas E-Kyc)ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నప్పటికీ చాలామంది వినియోగదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాటు గడువు ఇచ్చినప్పటికీ, ఈసారి మాత్రం కేవలం రెండేళ్లలోనే ఈ ప్రక్రియను ముగించేందుకు ఆయిల్ సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో డొమెస్టిక్ (గృహ) గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ వెండర్లు వ్యాపార ప్రయోజనాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ రకమైన దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకే ఆయిల్ కంపెనీలు ఈ-కేవైసీ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి.

సులువైన మార్గాలు & తక్షణ పరిష్కారం:

ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం చాలా సులభమని గ్యాస్ ఏజెన్సీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వినియోగదారులు తమ గ్యాస్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా ఇంట్లోనే కూర్చుని సొంతంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే, గ్యాస్ డెలివరీ బాయ్స్ వద్ద ఉండే మొబైల్ యాప్స్ ద్వారా లేదా నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డీలర్ల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చు. గ్యాస్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడకముందే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.