Hyderabad Police: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. మీ నంబర్ ప్లేట్ సరైనదేనా.. సీజ్ చేస్తున్నారు చూసుకోండి!
హైదరాబాద్ (Hyderabad Police)లో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరిగితే ఇక జైలుకే ట్రాఫిక్ పోలీసులు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు.
Hyderabad Traffic Police register 5 criminal cases regarding fake number plates
- నకిలీ నంబర్ ప్లేట్లపై చర్యలు
- వాహనదారులపై క్రిమినల్ కేసులు
- హెచ్ఎస్ఆర్పీ ప్లేట్లు తప్పనిసరి
Hyderabad Police: హైదరాబాద్లో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరిగితే ఇక జైలుకే! సిటీలో నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. నకిలీ నంబర్ ప్లేట్లు వాడే కిలాడీలపై ఉక్కుపాదం మోపుతూ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజుల్లో నగరంలోని జూబ్లీహిల్స్, మలక్పేట్, బేగంబజార్, అబిడ్స్, కాచిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేసి, పలు వాహనాలను సీజ్ చేశారు.
Also Read: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. SIR సర్వే గడువు పొడిగింపు
ట్రాఫిక్ రూల్స్ ధిక్కరిస్తూ నకిలీ నంబర్ ప్లేట్లతో తప్పించుకోవాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇకపై ప్రతి వాహనానికి తప్పనిసరిగా ‘హెచ్ఎస్ఆర్పీ’ (HSRP) నంబర్ ప్లేట్ ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే వాహనాల సీజింగ్తో పాటు కఠినమైన క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన పోలీసులు, నగరవ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేయనున్నారు.
