సివంగులు : క్లాస్ రూంలోనే మందుకొట్టిన విద్యార్థినులు

  • Publish Date - February 18, 2019 / 09:01 AM IST

విజయవాడ : తెలిసీ తెలియని వయస్సు.. లోకం పోకడ తెలియని వయస్సు.. 9వ తరగతి చదివే బాలికలు ఇలాగే ఉంటారు అనుకుంటాం.. ఈ బాలికలు మాత్రం భిన్నం. కొంచెం కంటే ఎక్కువే. ఈ కాలానికి బాగా కనెక్ట్ అయ్యారు. ఏకంగా క్లాస్ రూంలోనే మందు కొట్టారు. బీరు సీసాల మూతలను నోటితో తీసి.. ఔరా అనిపించారు. ఏకంగా టీచర్ కు అడ్డంగా దొరికిపోయారు. ఏపీ స్టేట్ క్యాపిటల్ విజయవాడలోని ఓ గవర్నమెంట్ స్కూల్లో శనివారం (ఫిబ్రవరి 17)న వెలుగుచూసింది ఈ ఇన్సిడెంట్. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు.. శనివారం ఉదయం స్కూల్ బ్రేక్ లో బీరు బాటిల్స్ తెచ్చుకున్నారు. స్కూల్ లో మందుకొట్టారు. అది ఊరికే ఉండదు కదా.. కిక్కు ఎక్కింది. పక్కనే ఉన్న తోటి విద్యార్థినులపై రెచ్చిపోయారు. బూతులు తిడుతూ చెలరేగిపోయారు. 

మద్యం తాగిన అమ్మాయిల తీరుపై తోటి విద్యార్ధులు హెడ్ మాస్టర్ కు కంప్లయింట్ చేశారు. వారి తీరుపై అనుమానించిన మాస్టారు డాక్టర్స్ ను పిలించటంతో అసలు విషయం బైటపడింది. స్కూల్ కు పేరంట్స్ ను పిలిపించిన ప్రిన్సిపాల్..  టీసీలు ఇచ్చి పంపించారు.

ఈ ఘటన విచారణ చేపట్టారు ప్రిన్సిపాల్. మిగతా పిల్లలను ప్రశ్నించాడు. కొత్తగా ఏమీ చేయలేదని.. కొన్నాళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు ఆ పిల్లలు చెప్పారు. వారి ఇళ్లల్లో మద్యం తాగుతారని.. దాన్ని కూల్ డ్రింక్ లో కలుపుకుని స్కూల్ కు తీసుకొస్తారని చెప్పుకొచ్చారు. దీనిపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 9వ తరగతిలోనే విద్యార్థినులు ఇలా ప్రవర్తించటం, వారిలో ఇలాంటి ఆలోచనలు రావటం దారుణం అన్నారు.

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు

Read Also : OMG : చావు దగ్గరకు వచ్చి ఆగింది