హైదరాబాద్ లోని గోల్నాకలో ఫంక్షన్ హాల్ గోడ కూలి నలుగురు మృతి చెందిన ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

గోల్నాకలోని పెరల్ గార్డెన్ లో పెళ్లి జరుగుతోంది. అదే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గోడ కూలిన ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు ఆటోలు శిథిలాల కింద ధ్వంసమయ్యాయి. 10 టూ వీలర్ లు నుజ్జునుజ్జు అయ్యాయి. పోలీసులు, జీహెచ్ఎంసీ టీమ్, డిజాస్టర్ టీమ్ ప్రమాద స్థలికి చేరుకున్నాయి.
గాయపడిన వారిని మలక్ పేటలోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈస్ట్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ తోపాటు మరికొంతమంది పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.