తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 60
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ వినిపించారు. పదవీ విరమణ వయో పరిమితిని పెంచుతామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్ట్ రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలని సీఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. అందరికీ ప్రమోషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని వెల్లడించారు. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.
సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండగ నాటికి వయో పరిమితి పెంపు నిర్ణయం అమలవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా మంగళవారం (సెప్టెంబర్ 3, 2019) జరిగిన సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సీఎం అంటే రాష్ట్రానికి ముఖ్యసేవకుడు అనే భావనతోనే నేనుంటాను అని కేసీఆర్ చెప్పారు. అధికారులు కూడా ప్రజా సేవకులం అని భావించి పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గ్రామ పంచాయతీలు నేలవిడిచి సాము చేయొద్దని కేసీఆర్ హెచ్చరించారు. పనితీరు సరిగా లేని సర్పంచులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.