భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ దోమలగూడలో బీఎస్‌జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మాజీ ఎంపీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విద్యార్థులతో ఆత్మీయ పలకరింపుల అనంతరం స్కూల్ ఆవరణలో గవర్నర్, కవిత మొక్కలు నాటారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ నిర్వహణను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మాజీ ఎంపీ కవిత…ఈ సందర్భంగా గౌరవ వందనం స్వీకరించారు.
విద్యార్ధులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం.. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తోటి వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గవర్నర్ స్కౌట్స్ డ్రెస్‌లో రావడం సంతోషంగా ఉందన్న కవిత..ఇది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు.