దేన్నీ వదలా : కరెంట్ సేవలకు GST షాక్

  • Publish Date - February 13, 2019 / 04:22 AM IST

GST.. ఏది కొన్నా అదనపు భారం. కట్టుకునే బట్టలు కొనాలన్నా GST తప్పనిసరి. ఇప్పుడు అది మరింత షాక్ కొట్టనుంది. విద్యుత్‌ వినియోగదారులపై సేవల పన్నుకు GST కలుపుతున్నారు. అది 18శాతం. జనవరి వాడుకున్న విద్యుత్ బిల్లులు కూడా ఫిబ్రవరిలో కట్టాల్సి ఉంటుంది. వాస్తవానికి విద్యుత్‌ GST పరిధిలోకి రాదు. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల జారీ.. అదనపు లోడ్‌ మంజూరు సేవలు దీని పరిధిలోకి వస్తాయని GST కమిషనరేట్‌ ఇటీవలే.. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలకు స్పష్టం చేసింది.
 

GST అమల్లోకి వచ్చిన 2017 జూలై 1వ తేదీ నుంచి జారీ చేసిన కొత్త విద్యుత్‌ కనెక్షన్లు, మంజూరు చేసిన అదనపు లోడ్‌ విషయంలో వినియోగదారుల నుంచి GST బకాయి వసూలు చేయాలని సంస్థ ఆదేశించింది. దీంతో విద్యుత్‌ చార్జీలు మినహా.. విద్యుత్‌ సేవలకు సంబంధించిన అన్ని రకాల డెవల్‌మెంట్‌ చార్జీలపై 18 శాతం GSTని విధిస్తున్నాయి.

 

కొత్త విద్యుత్‌ కనెక్షన్‌తోపాటు ఇప్పటికే కనెక్షన్‌ కలిగి ఉండి.. అదనపు లోడ్‌ ( ఉదాహరణకు ట్రాన్సఫారమ్, 3ఫేజ్, మీటర్ల మార్పు లాంటివి) కోసం దరఖాస్తు చేసే వారి నుంచి GST వసూలు చేస్తున్నాయి. 2017 జూలై నుంచి ఇచ్చిన కొత్త కనెక్షన్లతోపాటు అదనపు లోడ్‌ మంజూరు చేయించుకున్న పాత వినియోగదారుల నుంచి కూడా GST బకాయిలను 2019 ఫిబ్రవరి నుంచి  విద్యుత్‌ బిల్లులతో కలిపి వసూలు చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు