తెలంగాణ శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.

  • Publish Date - September 11, 2019 / 11:46 AM IST

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ దగ్గరకు మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌, ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు విపక్ష సభ్యులు తీసుకెళ్లారు. సుఖేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనమండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం 2019, మార్చి 29న ముగిసింది. అప్పటి నుంచి తాత్కాలిక చైర్మన్‌గా డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ కొనసాగుతున్నారు. బుధవారం (సెప్టెంబర్ 11, 2019) గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మూడుసార్లు ఎంపీగా పని చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.