హైదరాబాద్ లో మళ్లీ కుండపోత : అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం (అక్టోబర్ 8, 2019) రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం మొదైలంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

  • Publish Date - October 8, 2019 / 03:45 PM IST

హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం (అక్టోబర్ 8, 2019) రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం మొదైలంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం (అక్టోబర్ 8, 2019) రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, బోరడండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై నీరు భారీగా నిలిచింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. దసరా పండుగ రోజున వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గుళ్లకు వచ్చిన వాళ్లు అవస్థలు పడ్డారు. 

మధ్యాహ్నం కూడా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షంతో.. ప్రజలు భయాందోళన చెందారు. వారం రోజులుగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా.. భారీ వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సోమవారం(అక్టోబర్ 7,2019) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా, రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు రైతు మరణించాడు. అత్యధికంగా పాల్వంచలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది.