హైదరాబాద్ లో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా సిటీలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ శాంతినగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 60.3 మి.మీ.లు కురవగా తిరిగి బుధవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకూ అదే ప్రాంతంలో 40 మి.మీ.లు వర్షం కురిసింది.
నేడు, రేపు కూడా ఈ వర్షాలు ఇలాగే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని రాజారావు తెలిపారు.