అందుకే నువ్వంటే ఇష్టం : ట్రాఫిక్ పోలీసులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు

హీరో అంటే పడిచచ్చే ఫ్యాన్స్.. తెరపై ఏం చేస్తాడో.. అభిమానులు రియల్ గా అనుసరించేస్తారు. అంత అభిమానాన్ని గుండెల నిండ పెట్టుకుంటారు.

  • Publish Date - March 20, 2019 / 01:27 PM IST

హీరో అంటే పడిచచ్చే ఫ్యాన్స్.. తెరపై ఏం చేస్తాడో.. అభిమానులు రియల్ గా అనుసరించేస్తారు. అంత అభిమానాన్ని గుండెల నిండ పెట్టుకుంటారు.

హైదరాబాద్: హీరో అంటే పడిచచ్చే ఫ్యాన్స్.. తెరపై ఏం చేస్తాడో.. అభిమానులు రియల్ గా అనుసరించేస్తారు. అంత అభిమానాన్ని గుండెల నిండ పెట్టుకుంటారు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ అయిపోయాడు. గీతగోవిందం తర్వాత యూత్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ హవా నడిపించేస్తున్నాడు. ఇటీవలే రౌడీ పేరుతో బ్రాండ్ ఇమేజ్ వేసుకున్నాడు. ఈ రౌడీని ఫాలో అయిపోయారు ఫ్యాన్స్ కూడా.
Read Also : మహా ఛాన్స్ : బాలీవుడ్ లోకి కీర్తి సురేష్

ఇద్దరు కుర్రోళ్లు బుల్లెట్ పై వెళుతున్నారు. ఆ బండికి నెంబర్ లేదు. రౌడీ అని రాసి ఉంది. వీళ్లు ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడ్డారు. వెంటనే ఆపారు. ఫైన్ వేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంత కచ్చితంగా ఉంటారో తెలుసుకదా.. దీనికి ఉదాహరణే 63 కోట్ల రూపాయల జరిమానాల పెండింగ్.

ఇదే ఊపులో రౌడీ బండిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ నెంబర్ ప్లేట్ ను నిబంధనలకు అనుగుణంగా ఫిక్స్ చేసుకోవాలి.. అందుకు విరుద్ధంగా ఉంటే CMV Rule 50 & 51 కింద జరిమానా విధించటం జరుగుతుంది. దీనిపై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తాం అని ప్రకటించారు.

నెంబర్ ప్లేట్ పై రాసి ఉన్న రౌడీ.. విజయ్ దేవరకొండ బ్రాండ్. ఈ విషయం తెలుసుకున్న హీరో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజీలో రియాక్ట్ అయ్యారు. వాళ్ల తరఫున నేను సారీ చెబుతున్నా.. ఇలాంటి పనులు చేయకుండా అందరిలో చైతన్యం తీసుకొస్తా.. ట్రాఫిక్ రూల్స్ అందరికీ తెలిసేలా నా వంతు కృషి చేస్తాను. ఈ కుర్రోళ్ల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను అని పోస్టు చేశాడు.

హీరో విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ అంటే ఎంత ప్రేమో అంటున్నారు. వాళ్లు తప్పు చేస్తే.. హీరో బహిరంగంగా క్షమాపణలు కోరటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. యూత్ ఐకాన్ దేవరకొండ ఇమేజ్ మరో మెట్టు పెరిగింది అంటున్నారు.

Read Also : వామ్మో చంపేస్తోంది : నిర్మల్ జిల్లా పంటపొలాల్లో మొసలి కలకలం