హైదరాబాద్‌ను కమ్మేసిన మబ్బులు : భారీ వర్షం

  • Publish Date - August 23, 2019 / 10:14 AM IST

కారుమబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. ఒకవైపు వర్షం కురుస్తోంది.. కాసేపటికి మబ్బులు తెరుకున్నాయి. అయినా వర్షం పడుతూనే ఉంది. చల్లటి గాలులతో వాతావరణ ఆహ్లాదంగా మారింది. హైదరాబాదీలకు బయట వెదర్ చూస్తే అప్పుడే సాయంత్రం అయ్యిందా అనే ఫీలింగ్ వచ్చింది. 

చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. భారీగా వర్షం కురుస్తుండటంతో రోడ్ల మీద వరద నీరు వరదలై పారుతోంది. ట్రాఫిక్ జామ్ తో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో అందరూ మెట్రో ప్రయాణం చేస్తున్నారు. దీంతో మెట్రో కూడా బాగా రద్దీగా మారింది.