తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ వార్డుల విభజన, ఎన్నికలు చట్టబద్ధంగా జరగడం లేదంటూ, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్ట్… ఈ సమయంలో మేము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు..అన్ని పిటిషన్లను కొట్టివేసింది. దీంతో.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయింది.
డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో, సింగిల్ బెంచ్ లో 78 మున్సిపాలిటీలపై ఉన్న స్టే ను కూడా కొట్టి వేసే అవకాశం ఉంది. పిటీషనర్ లు దాఖలు చేసిన కేసులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకభవిస్తూ కోర్టు ఈతీర్పు ఇచ్చింది. కోర్టు పిటీషన్లు కొట్టి వేయటంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉంది.