ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. 

  • Publish Date - October 29, 2019 / 11:18 AM IST

ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. 

ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం (అక్టోబర్ 30, 2019) సరూర్ నగర్ స్టేడియంలో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరికి నిర్వహించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. 

సకల జనుల సమరభేరికి అనుమతివ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆర్టీసీ సమ్మె కారణంగా చాలామంది కార్మికులు చనిపోయారని… మిగతా వారిలో ఆత్మస్టైర్యం నింపడం కోసమే సభను ఏర్పాటు చేశామని ధర్మాసనానికి నివేదించారు. సకల జనుల సమరభేరికి ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరించడంతో… సరూర్‌నగర్‌లో కాకపోతే… ఎక్కడ అనుమతి ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సరూర్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.