ఎక్కువ కరెంట్ ఇచ్చిందని TSSPDCLకు జరిమానా

లో వోల్టేజ్, కరెంటు కోత కంప్లైంట్‌లు వింటూనే ఉంటాం. తొలిసారి పవర్ డిస్కంకు అరుదైన కేస్ ఎదురైంది. హై వోల్టేజితో కూడి కరెంట్ ను సప్లై చేసినందుకు జరిమానా ఎదుర్కొంది. ఈ ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. 

సీతాఫల్‌మండిలో ఉంటున్న శివ కుమార్ భాస్కరన్ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మీద కేస్ ఫైల్ చేశాడు. తన ఇంటికి హై వోల్టేజి సప్లై చేసిన కారణంగా టీవీ, వాషింగ్ మెషీన్, కంప్యూటర్, ట్యూబ్ లైట్లు అన్నీ కాలిపోయాయి. దీంతో కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. ఫలితంగా అతనికి రూ.38వేల 690ఇవ్వాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.

2015 అక్టోబరు 3న పవర్ ట్రాన్సమిషన్ లైన్ల రిపైర్ కారణంగా కరెంట్ కట్ అయింది. మరమ్మతుల తర్వాత టీఎస్ఎస్‌పీడీసీఎల్ హై వోల్టేజి కరెంట్ ఇచ్చింది. దగ్గర్లో ఉన్న మూడు వీధుల్లో స్విచ్ ఆన్ చేసి ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులన్నీ పూర్తిగా డ్యామేజీ అయ్యాయి. 

భాస్కరన్ పవర్ డిస్కం సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వారి నుంచి స్పందన రాకపోతుండటంతో తండ్రిని తీసుకుని తాను రిపైర్ చేయించిన వస్తువల బిల్లుతో పవర్ ఆఫీసుకు వెళ్లాడు. మరోసారి నేరుగా కంప్లైంట్ రాసి ఇచ్చాడు. 

మూడు నెలలు పూర్తి అయినా స్పందన లేకపోవడంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. బెంచ్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో అదే సమయంలో కరెంట్ పోయిందా అనే విషయాన్ని నిర్దారించుకున్న తర్వాత బాధితుడికి పవర్ డిస్కం రూ.39వేలు ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది. 

ట్రెండింగ్ వార్తలు