విదేశాల్లో ఉండగానే : హెచ్ఎండీఏ కమిషనర్‌పై బదిలీ వేటు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. జనార్దన్‌రెడ్డికి ప్రభుత్వం ఏ పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో

  • Publish Date - January 28, 2019 / 01:51 PM IST

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. జనార్దన్‌రెడ్డికి ప్రభుత్వం ఏ పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిపై బదిలీ వేటు వేసింది. జనార్దన్‌రెడ్డికి ప్రభుత్వం ఏ పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జనార్దన్‌రెడ్డి.. విదేశీ పర్యటన నుంచి రాగానే జీఏడీకి(సాధారణ పరిపాలన శాఖ) రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. హెచ్ఎండీఏ నూతన కమిషనర్‌గా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనను బదిలీ చేయడం, పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడం చర్చనీయాంశమైంది.