గమనిక : గురువారం సెలవు, శనివారం పనిదినం

గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ

  • Publish Date - September 12, 2019 / 02:23 AM IST

గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ

గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం(సెప్టెంబర్ 12,2019) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఇచ్చారు. గురువారం సెలవు ప్రకటించడంతో సెప్టెంబర్ 14న అంటే రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. 21వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీస్ ఫోర్స్‌తో నిఘా పెట్టారు. నవరాత్రుల పూజలందుకున్న లంబోదరుడికి జనాలు బై.. బై.. చెబుతున్నారు. జంట నగరాల్లో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది.

ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే హైఅలర్ట్ ఉన్న నేపథ్యంలో.. నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగే రూట్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు.

* 3 లక్షల సీసీ కెమెరాలు వినియోగం.
* బాలాపూర్ నుంచి చార్మినార్ వరకు అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన రూట్‌లో 66 సీసీ కెమెరాలు, 4 మొబైల్ కెమెరాలు ఏర్పాటు. 
* ట్యాంక్‌ బండ్‌ దగ్గర వందకుపైగా సీసీ కెమెరాలు.
* సిటీ కమిషనర్, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ కు అనుసంధానం. 
* 8 కంపెనీల కేంద్ర బలగాలతో సహా మొత్తం 35వేల మంది పోలీసులతో భద్రత. 
* నలుగురు అదనపు సీపీలు, 9 మంది డీసీపీలు, 20 మంది అదనపు డీసీపీలు, 64 మంది ఏసీపీలు, 244 మంది ఇన్‌స్పెక్టర్లు, 618 మంది ఎస్‌ఐలు, 636 మంది ఏఎస్సైలు, 1700 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు.
* నిమజ్జనం విధుల్లో 7,198 మంది కానిస్టేబుళ్లు, 680 మంది ఎస్‌పిఓలు, 6000 మంది హోంగార్డులు.