Site icon 10TV Telugu

మెట్రో పిల్లర్ ను ఢీకొని షాపులోకి దూసుకెళ్లిన బస్సు

Hyderabad Accident: RTC Bus Accident In Ameerpet

మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడిపడి ఓ మహిళ చనిపోయి 24 గంటలు కాకముందే.. హైదరాబాద్ అమీర్ పేటలో మరో ఘోరం. ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. మెట్రో పిల్లర్ ను ఢీకొని.. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. అమీర్ పేట్ లోని గురుద్వార్ సమీపంలో సోమవారం (సెప్టెంబర్ 23, 2019) ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సికింద్రాబాద్ నుంచి మియాపూర్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సు ముందు టైర్ పంచర్ కావడంతో బ్యాలెన్స్ తప్పింది. మెట్రో పిల్లర్ ను ఢీకొంది. అప్పటికీ ఆగకుండా పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం మెట్రో పిల్లర్ నెంబర్ C1442 దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో నలుగురికి గాయాలు కావడంతో స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. రద్దీగా ఉండే ఈ ఏరియాలో బస్సు బీభత్సం సంచలనంగా మారింది. అప్పటికే మెట్రో స్టేషన్ పెచ్చులు ఊడి మహిళ చనిపోయన ఘటనతో షాక్ ఉన్న ప్రజలు.. ఈ ఘటనతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాక అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపారు. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. బస్సును అక్కడి నుంచి తొలగించారు.

టైర్ పంచర్ అయి.. మెట్రో పిల్లర్‌ను ఢీకొనటం ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని అంచనా వేశారు అధికారులు. లేకపోతే జనంపైకి దూసుకెళ్లి చాలా ప్రాణాలు పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు.

Exit mobile version