హైదరాబాద్ వాసులకు శుభవార్త. విదేశీ వ్యవహరాల శాఖ మరి కొద్ది రోజుల్లోనే ఈ-చిప్‌తో కూడిన పాస్ పోర్టులను నగరవాసులకు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆరేళ్లుగా జరుగుతున్న చర్చపై తుది నిర్ణయానికి రావడంతో ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భద్రతా విషయాల రీత్యా చిప్ బేస్డ్ పాస్ పోర్టు కీలకంగా వ్యవహరిస్తాయి.
రెగ్యూలర్ పాస్‌పోర్టులు ఇష్యూ చేయడానికి ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం నాలుగు నుంచి ఐదు రోజుల సమయం తీసుకుంటుంది. ఈ పాస్ పోర్టులు కూడా అంతే సమయంలోగా వినియోగదారుల చేతికి అందిస్తారు. ప్రస్తుతం ఇస్తున్న పాస్ పోర్టులను 2013వ సంవత్సరం నుంచి గోస్ట్ ఇమేజ్(డిజిటల్ ఫొటో)తో అందిస్తున్నారు. అయితే వాటి స్థానంలో ఇవి వస్డే మాత్రం చిప్‌తో డేటా మొత్తం క్లుప్తీకరించి ఇవ్వనున్నారు. పాస్ పోర్టులు డిమాండ్ చేస్తున్న ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ముఖ్యమైనది.
ఈ చిప్‌లో దరఖాస్తుదారుడి బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా, ఫొటోలతో కూడిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎవరైనా ఫొటో మార్చాలని ప్రయత్నించినా వేరే ఏ ఇతర మోసాలకు పాల్పడేందుకు యత్నించినా పాస్ పోర్టు ఆఫీస్‌కు మెసేజ్ వెళ్లిపోతుంది. పాస్ పోర్టు మీద డేటా చిప్‌లో ఉండే డేటా వేర్వేరుగా ఉంటే అడ్డంగా బుక్కయినట్లే.
పాస్ పోర్టు సేవా కేంద్రాలైన బేగంపేట, టోలీ చౌక్, సికింద్రాబాద్, అమీర్‌పేట్‌లలో కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.