కార్ పెండింగ్ చలాన్లు వెరిఫై చేస్తున్న ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఓ కార్ వివరాలు చెక్ చేసి కంగుతిన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 78 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి మొత్తం రూ.97వేలుగా ఉన్నాయి. సాధారణ చెకింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ ఎస్సై రాఘవేంద్ర స్వామి టయోటా ఎటియోస్ కార్‌ను మైత్రివనం దగ్గర ఆపి చెక్ చేశారు.
అందులో 2017నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 78చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కారును సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. ఎప్పుడైతే పెండింగ్ లేకుండా అన్ని చలాన్లు అక్షరాల రూ.96వేల 830రూపాయలు కడతారో అప్పుడే కార్ విడుదల చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్‌లో వాహనాల యజమానులు తమ వెహికల్‌కు సంబంధించి పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించాలని తెలిపారు. లేకుండా దానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
HYDTP requests all the commuters to check the pending cases on their vehicles and pay the amount immediately. @AddlCPTrHyd pic.twitter.com/yHqztsOcbG
— Hyderabad Traffic Police (@HYDTP) May 13, 2019
#HYDTPinfo Today while conducting a special drive against Top Violators, Tr PS SR Nagar Cops found one car with (78) pending eChallans and an amount of Rs. 96,830/- at Maithrivanam. After paying eChallans the car was handed over to the driver.
— Hyderabad Traffic Police (@HYDTP) May 13, 2019