అక్కకు అసభ్య మెసేజ్ లు పంపి వేధిస్తున్న తమ్ముడు
- nagamani
- Published On : February 4, 2021 / 03:54 PM IST
cousin harassment sister : తమ్ముడైనా..అన్న అయినా సోదరికి ఎవరినన్నా వేధిస్తున్నారంటూ వెళ్లి చితక్కొట్టి వస్తాడు. కానీ వావి వరసలు వదిలేసిన ఓ వెధవ మాత్రం అక్కకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ వేధించాడు. అవి ఎవరి పంపుతున్నారో తెలీని ఆమె వేదన పడేది. లైంగిక వాంఛ తీర్చాలని లేకపోతే నీ పని చెబుతానంటూ వేధించేవాడు.
సోషల్ మీడియాలో తరచూ అసభ్య సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడు.దీంతో అవి భరించలేని ఆ యువతి గురువారం (జనవరి 4) సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. మెసేజ్ లు చూపించి అతనెవరో తెలియటంలేదు..ఈ వేధింపులు భరించలేకున్నానంటూ మెరపెట్టుకుని ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరసకు తమ్ముడయ్యే ఓ యువకుడు ఆమెకు అసభ్య మెసేజ్ లు పింపిస్తున్నాడని గుర్తించారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పేసరికి ఆమె షాక్ అయ్యింది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేసామని తెలిపారు.
