ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గంగ తెప్పోత్సవం కార్యక్రమాన్ని తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద గంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తామని ఆ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్కు మహేందర్ బాబు, పూస నర్సింహా, మెట్టు సూర్య ప్రకాశ్, దోలి రమేశ్ తెలిపారు.
ఖైరతాబాద్‌లోని ఏడుగుళ్ల నుంచి బోనాలు, తెప్పలతో ఖైరతాబాద్ రైల్వే గేటు, గణేష్ విగ్రహం, ఐమ్యాక్స్ థియేటర్ మీదుగా ర్యాలీగా గంగమ్మ గుడి వద్దకు చేరుకుని.. అక్కడ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ తెప్పోత్సవం ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొంటారని తెలిపారు.
అనంతరం బహిరంగ సభ జరుగుతుందని.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని గంగపుత్రులంతా ఉత్సవాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు చంద్రశేఖర్, గుండు జగదీష్‌బాబు, కాపరనేని లింగం, బైరు బాబురావు, మామిడి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.