ఫుడ్ డెలివరీ జాబ్ అంటే.. మగవాళ్లకు మాత్రమే. పురుషులు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. మహిళలకు ఆ రంగం పనికిరాదు. ఆ పనులు వారు చేయలేరు. అందుకే ఫుడ్ డెలివరీ
ఫుడ్ డెలివరీ జాబ్ అంటే.. మగవాళ్లకు మాత్రమే. పురుషులు మాత్రమే ఆ జాబ్ చేయగలరు. మహిళలకు ఆ రంగం పనికిరాదు. ఆ పనులు వారు చేయలేరు. అందుకే ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పని చేసేవారంతా మగవాళ్లే. కానీ ఫస్ట్ టైమ్.. దీనికి భిన్నంగా జరిగింది. ఫుడ్ డెలివరీ సర్వీస్ లోకి గర్ల్ కూడా వచ్చింది. అవును… ఓ అమ్మాయి ఫుడ్ డెలివరీ జాబ్ ని ఎంచుకుంది. ఏజెంట్ గా మారింది. మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా సర్వీస్ చేస్తోంది. హైదరాబాద్ కి చెందిన 20 ఏళ్ల జనని రావ్ స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా జాయిన్ అయ్యింది. ఈ ఫీల్డ్ ని ఎంచుకుని అందరిని ఆశ్యర్యపరిచింది. మగవాళ్లకు మాత్రమే అనుకున్న జాబ్ లోకి అమ్మాయి రావడం విశేషంగా మారింది.
”కంపెనీలో జాయిన్ అయ్యి రెండున్నర నెలలు అవుతోంది. ఈ జాబ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఫన్ కూడా ఉంది. ఈ అనుభవం మాటల్లో చెప్పలేను” అని జనని రావ్ అంటోంది. ఈ జాబ్ చేస్తున్నందుకు కస్టమర్లు తనను అభినందిస్తున్నారని జనని చెప్పింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ ఫీల్డ్ లో మహిళను చూడటం ఆనందంగా ఉందని అంటున్నారని జనని తెలిపింది. జాబ్ అనేది జాబ్.. అది చిన్నదా, పెద్దదా అనేది క్వశ్చన్ కాదు. ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత బెటర్ గా చేయగలము అని ఎంతో ఉత్సాహంగా చెబుతుంది జనని.
మరి భద్రత గురించి భయం లేదా అని అడిగితే.. సేఫ్టీ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో మహిళలకు పూర్తి రక్షణ ఉందని జనని చెబుతుంది. మహిళలకు భద్రత విషయంలో హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో ఉందని గుర్తు చేసింది. సెక్యూరిటీ గురించి అస్సలు భయపడాల్సిన పనే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ రంగంలోకి రావాలని అమ్మాయిలను ఆహ్వానించింది.
ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ఈ జాబ్ లో జాయిన్ కావొచ్చని చెప్పింది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్న జనని రావ్ ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నిజంగా గ్రేట్ అని అభినందిస్తున్నారు. మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రూవ్ చేశావని మెచ్చుకుంటున్నారు.