విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మారో అరుదైన మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలోని క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది హైదరాబాద్. ఈ లిస్ట్ లో యునెస్కో మొత్తం 66 నగరాలకు చోటు దక్కగా.. దాంట్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. యునెస్కో లిస్ట్ లో భారత్ నుంచి ముంబై, హైదరాబాద్ లు చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో 66 నగరాలను సెలక్ట్ చేసింది. ముంబై మహానగరాన్ని సినిమా కేటగిరీలో సెలక్ట్ చేయగా.. హైదరాబాద్ నగరాన్ని ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి సెలక్ట్ చేశారు. కాగా హైదరాబాద్ భిన్న రుచులకు, ఆలవాలమైన విషయం తెలిసిందే. ఇరానీ చాయ్ నుంచి ఎక్కడా లేని రుచి హైదరాబాద్ బిర్యానికి మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ అంటే బిర్యానీ..బిర్యాని అంటే హైదరాబాద్ అనే పేరును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఒక్క బిర్యానీయే కాదు పలు భిన్నమైన విభిన్నమైన వంటకాలలు హైదరాబాద్ లో లభిస్తాయి. ఈ క్రమంలో ఆహారం, తినుబండారాల (గాస్ట్రోనమీ) విభాగం నుంచి హైదరాబాద్ ను యునెస్కో సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
భారతదేశం నుంచి 18 నగరాలు ఈ జాబితాలో స్థానం కోసం పోటీపడ్డాయి. వాటిలో కేవలం నాలుగు నగరాలు (హైదరాబాద్, ముంబై, శ్రీనగర్, లక్నో) చివరి వరకు పోటీలో నిలవగా ముంబై, హైదరాబాద్ లు చోటు దక్కించుకోవటం విశేషం.
కాగా..భిన్న సంస్కృతీ సంప్రదాయాల మేళవింపుతో హైదరాబాద్ మహానగరం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రత్యేకమైన..అనుకూల వాతావరణం ఉంటుంది. దీంతో ఏ ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా సరే ఇక్కడ ఇమిడిపోగలుగుతున్నారు. ఐటీ హబ్, బహుళ జాతి సంస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది భాగ్యనగరం.