భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని ‘తలాక్’ చెప్పాడు 

  • Publish Date - November 1, 2019 / 05:09 AM IST

భార్య పళ్లు (దంతాలు) ఎత్తుగా ఉన్నాయని వంకతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పాడు. పెళ్లి అయిన మూడు నెలలకే తలాక్ చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మూడు నెలల వరకూ భార్యకు పళ్లు ఎత్తుగా ఉన్నాయనే విషయం తెలియలేదా? అనేది డౌట్ ఎవ్వరికైనా వస్తుంది. కానీ అక్కడ దంతాలు సమస్య కాదు..భార్యనుంచి అదనపు కట్నం రావట్టుకోవటం కుదరదంటే తలాక్ తో వదిలించుకోవటం.దీంతో బాధితురాలు రుక్సానా భర్త ముస్తఫా పోలీసులను ఆశ్రయించింది. 

మూడు నెలల క్రితం 2019 జూన్ 27 న తనను వివాహం చేసుకున్న ముస్తాఫా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడనీ ఫిర్యాదులో తెలిపింది. తాను తన భర్త వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తమ మధ్య ఎటుంటి సంబంధం లేదని చెబుతున్నాడని రుక్సానా వాపోయింది. 

తమ వివాహ సమయంలో ముస్తాఫా, అతని కుటుంబం పలు విషాయాల్లో డిమాండ్స్ చేశారనీ..వాటిన్నింటినీ తమ కుటుంబం నెరవేర్చిందనీ..కానీ వివాహం తరువాత కూడా తనను అధికంగా డబ్బు..బంగారం తేవాలనీ.. ఒత్తిడిచేస్తూ వేధిస్తున్నారంది. తన మరిది కూడా తనకు బైక్ కావాలని వేధిస్తున్నాడని ఫిర్యాదులో రుక్సానా వాపోయింది. ఇలా వేధించీ..వేధించి చివరకు నీ పళ్ళు నాకు నచ్చటంలేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు..నీ పుట్టింటికి పొమ్మని భర్త అంటూన్నా తాను వెళ్లటంలేనందు వల్ల తలాక్ చెప్పి వెళ్లిపోయాడని కన్నీటితో చెప్పింది. తన అత్తగారు తనని 15 రోజుల పాటు రూమ్ లో పెట్టి తాళం వేసి బంధించిందని తెలిపింది. రుక్సానా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ముస్లిం సామాజిక వర్గాల్లో భార్యలను  తలాక్ పెద్ద సమస్యగా తయారైంది. దీంతో మహిళలకు వీధిన పడుతున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టంలో మార్పులు చేసినా..ఈ అన్యాయాలకు ముస్లిం మహిళలకు బలైపోతూనే ఉన్నారు.  అర్థం పర్థం లేని కారణాలు చెప్పి తలాక్..తలాక్..తలాక్ అని చెప్పేసి వదిలించుకుంటున్నారు.తరువాత మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. 

కాగా…ట్రిపుల్ తలాక్‌ చెప్పడం ద్వారా విడాకులిచ్చే పద్ధతిని క్రిమినల్‌ నేరంగా పరిగణించే ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019 బిల్లును పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో ఆ బిల్లు చట్టం రూపం దాల్చింది. ముస్లిం మహిళకు మూడుసార్లు తలాక్‌ చెబితే.. కొత్త చట్టం ప్రకారం భర్తలకు మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. అయినా సరే ఇటువంటి అన్యాయాలు కొనసాగుతునే ఉన్నాయి.