త్వరగా తీసుకురండి : మెట్రో కనెక్టెవిటీకి ఈ-ఆటోలు

హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇ-ఆటోలను ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతుంది.

  • Publish Date - March 22, 2019 / 06:14 AM IST

హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇ-ఆటోలను ప్రవేశపెట్టడానికి సమాయత్తం అవుతుంది.

హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఈ-ఆటోలను ప్రవేశపెట్టనుంది. అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గంలో వీటిని రోడ్డెక్కించనుంది. నాగోల్-మియాపూర్, అమీర్ పేట-ఎల్ బీ నగర్ వరకు పలు స్టేషన్లలో ఇప్పటికే సైకిళ్లు, ఈ-బైక్ లు, సంప్రదాయ బైకులను నడుపుతున్నాయి కంపెనీలు. వీటికితోడు ఇప్పుడు మరో 10 స్టేషన్లలో ఈ-ఆటోలు నడిపేందుకు ప్లాన్ చేస్తోంది మెట్రో. JNTU, KPHB, ఎర్రగడ్డ, SR నగర్, దిల్ సుఖ్ నగర్, విక్టోరియా మెమోరియల్, హబ్సిగూడ, ఖైరతాబాద్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ స్టేషన్ల పరిధిలో ఈ-ఆటోలు నడిపేందుకు సిద్ధమవుతున్నారు. పర్యావరణ అనుకూలమైన వివిధ సంస్థలతో సహకారంతో తీసుకొస్తున్నారు.

Read Also : కొత్త ఆప్షన్ : రైలు టికెట్ బదిలీ చేసుకోవచ్చు

అమీర్ పేట – హైటెక్ సిటీ మార్గంలోనే 100 ఈ-ఆటోలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది మెట్రో. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని పెంచనున్నారు. ఈ-ఆటోలో మూడు లేదా ఐదు సీట్లు ఉంటాయి. GPS ట్రాకింగ్ వ్యవస్థతో ప్రయాణీకుల భద్రతకు హామీ ఉంటుంది. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యూనిఫాం ఉంటుంది. పనితీరుపై ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సేకరిస్తారు. హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా.. అధిక ఛార్జీలు వసూలు, ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించటం, మొబైల్ డ్రైవింగ్ చేసినట్లైతే ఫిర్యాదు చేయవచ్చు. అతి త్వరలోనే ఇవి రోడ్డెక్కనున్నాయి.

Read Also : చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు