మండుతున్న ఎండలు : హైదరాబాద్ లో 42 డిగ్రీలు 

  • Publish Date - April 2, 2019 / 06:08 AM IST

హైదరాబాద్ : వేసవిలో ఎండలకు నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో వీకెండ్స్ లో హాయిగా బైటకు వెళ్లి ఎంజాయ్ చేయానుకునేవారు సైతం ఎండ తాకిడికి  ఇంటి నుంచి బైటకు అడుగు పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో నగరంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని ముషీరాబాద్ లో అత్యంత  42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా..ముషీరాబాద్,కుతుబల్లపూర్ 42.2 డిగ్రీలు,  మైత్రివనం 42.1,బాలనగర్ 41.8 డిగ్రీలు..ఆదిలాబాద్, నిజామాబాద్ లలో 42 డిగ్రీలు నమోదయ్యింది. మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్..రామగుండంలలో  41 డిగ్రీలు.. ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. 

అలాగే కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మార్చి 2 మంగళవారం అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా  ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. మార్చి 1 సోమవారం భద్రాత్రి కొత్తగూడెం జిల్లాలో 43.2, ఆదిలాబాద్ జిల్లాలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.