ఈజీ ఎస్కేప్ : ఇక్కడి గొలుసులకు బరువెక్కువట అందుకే చోరీలు

హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్స్ తెలిపారు.

  • Publish Date - January 9, 2019 / 06:40 AM IST

హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్స్ తెలిపారు.

చైన్ స్నాచర్స్ ఈజీ టెక్నిక్స్..
హైదరాబాద్ లో ఈజీ ఎస్కేప్
ఇక్కడి గొలుసులు బరువు ఎక్కువుంటాయ్
హైదరాబాద్ లో యూపీ దొంగలు
ఎర్లీ మార్నింగ్ ఎక్కేస్తారు డ్యూటీ
రెండు రోజుల్లో తొమ్మిది స్నాచింగ్‌లకు 
అదీ కేవలం నా
లుగు గంటల్లో 

హైదరాబాద్ : హైదరాబాద్ లోనే చైన్స్ స్నాచింగ్ ఎందుకు ఎక్కవవుతున్నాయో తెలుసా..ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చట..పైగా ఇక్కడ మహిళలు వేసుకునే గొలుసుల బరువు ఎక్కువ అందుకే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వస్తుందని యూపీ నుండి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నామని పోలీసులకు పట్టుబడిన చైన్ స్నాచర్స్ తెలిపారు. ఈ క్రమంలో గొలుసు దొంగలు చోరీ చేసిన తరువాత దొరకుండా వుండేదుకు ఈజీ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. ఎక్కడ చోరీ చేయాలి..చేసాక ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే విషయాలపై పూర్తి అవగాహనతోనే చోరీలకు పాల్పడుతున్నారు.  చైన్ స్నాచింగ్ ల కోసం నార్త్ నుండి వచ్చి సౌత్ లో ఎందుకు చేస్తున్నారు అని విచారిస్తే పోలీసులకు విస్మయం కలిగించే అంశాలు ఈ స్నాచర్ తెలిపారు. హైదరాబాద్ విశాలంగా వుంటుందనీ..ఇక్కడ స్నాచింగ్ చేస్తే ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చనీ..పైగా ఇక్కడివారు గొలుసులు ఎక్కవ బంగారంతో చేయించుకుంటారని అందుకే ఇక్కడ చోరీలు చేస్తున్నామని యూపీ దొంగలు పోలీసుల విచారణలో  తెలిపారు.  

గత కొంత కాలంగా హైదరాబాద్ లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది గొలుసు చోరీలు జరగగా..వాటిలో కేవలం నాలుగు గంటల్లోనే 9 చోరీలు జరగటంతో చైన్ స్నాచర్స్ ఎంత ఈజీగా చోరీలకు పాల్పడుతున్నారో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో రెండు రోజుల్లో తొమ్మిది స్నాచింగ్‌లకు పాల్పడి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సీరియల్‌ స్నాచర్ల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 
ఉత్తరప్రదేశ్‌లో పట్టుకున్న వీరి వద్ద నుండి చోరీ చేసిన 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని జనవరి 8 నగరానికి తీసుకొచ్చారు. వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 

రెండు రోజుల్లో వరుస హల్‌చల్‌…
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ స్నాచర్స్ 15 రోజుల క్రితం  కేవలం  రెండు రోజుల్లో తొమ్మిది స్నాచింగ్స్‌ చేసి నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మలక్‌పేటలో బైక్‌ ని అద్దెకు తీసుకున్న వీరు ఒక్క గంటలోనే మీర్‌పేట, వనస్థలిపురం, హయత్‌నగర్, ఎల్బీనగర్‌ లలో చోరీ చేసిన అనతరం నల్లగొండ చౌరస్తా మీదుగా మలక్‌పేట చేరుకుని చైతన్యపురిలో ఉదయం 7 గంటలకే డ్యూటీ ఎక్కేసారు.ఈసారి వాళ్లు ఎక్కువ టైమ్ తీసుకోకుండా..కేవలం 40 నిమిషాల్లో వనస్థలిపురం, హయత్‌నగర్‌ల్లో నాలుగు స్నాచింగ్స్‌ చేశారు. 

వరుస స్నాచింగ్‌ తో సీసీ కెమెరా ఫుటేజ్‌లో కేటీఎం వాహనం వెనుక కూర్చున్న స్నాచర్‌ ఓ ట్రావెల్‌ బ్యాగ్‌ను వెనుక వేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు దొంగలంతా వేరే రాష్ట్రానికి చెందినవారని గుర్తించారు. వారు వాడిని కేటీఎం బైక్ మహేశ్వర్‌రెడ్డి పేరుతో ఉండటంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా రెండేళ్ల క్రితమే దాన్ని సూఫియా అనే వ్యక్తికి  అమ్మివేసినట్లుగా తెలిపాడు. దీంతో ఎవరికి అమ్మాడో తెలుసుకుని అతన్ని విచారించగా అతను చైక్స్ అద్దెకిస్తున్నట్లుగా తెలుసుకున్నారు.సూఫియాన్‌ వద్దే ఉత్తరాది స్నాచర్లకు ఈ వాహనాన్ని నగరానికి చెందిన ఓ వ్యక్తి అద్దెకు ఇప్పించినట్లు తేలింది. దీంతో చైన్ స్నాచర్స్ గుట్టు బైటపడింది. 
 

ట్రెండింగ్ వార్తలు