హైదరాబాద్‌లో 6న వాటర్ సరఫరా బంద్ అయ్యే ప్రాంతాలు ఇవే

  • Publish Date - January 4, 2020 / 05:50 AM IST

హైదరాబాద్ నగర వాసులు దాహార్తిని తీర్చే కృష్ణా ఫేజ్‌-3 జలాల తరలింపులో ఆటంకం ఏర్పడింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6న నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో సాహేబ్‌నగర్‌, ఆటోనగర్‌, వైశాలీనగర్‌, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌ దేవరపల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ, బుద్వేల్‌, సులేమాన్‌ నగర్‌, హైదర్‌గూడ, గోల్డెన్‌ హైట్స్‌, గందంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, అసిఫ్‌నగర్‌, రెడ్‌హిల్స్‌, షేక్‌పేట్‌, ప్రశాసన్‌ నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్‌, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్‌, సైనిక్‌పురి, లాలాపేట, స్నేహపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్‌ ప్రాంతాల్లో సోమవారం ఒక్క రోజూ నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

 

నాగార్జున సాగర్‌ అక్కంపల్లి రిజర్వాయర్‌ నుంచి సాహేబ్‌నగర్‌ వరకు నీటి తరలింపులో భాగంగా 2200, 1500 ఎంఎం డయా పైపులైన్‌ లకు భారీ లీకేజీలు ఏర్పడ్డాయి.వీటికి మరమత్తులు చేయాల్సి ఉంది. దీంతో  ఈ నెల సోమవారం 6న ఉదయం ఆరు గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల పాటు ఈ మరమ్మత్తులు కొనసాగుతాయి. దీంతో 24 గంటలు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు  తెలిపారు.కాబట్టి ఆయా ప్రాంత వాసులు ముందస్తు జాగ్రత్త వహించాలని కోరారు.