నైరుతి బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. శ్రీలంకకు ఆగ్నేయంగా, హిందూ మహాసముద్రం దాని పరిసర ప్రాంతాలను ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హిందూ మహా సముద్రం దాటి బంగాళాఖాతం చేరుకునే సమయంలోనే పీడనం బలపడనుంది.
పీడనం సంభవించిన 48గంటల వ్యవధిలోనే వాయుగుండగా మారుతుందని హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో.. తమిళనాడు తీరప్రాంతం దాటి శ్రీలంకలోని ఈస్ట్ కోస్ట్ దిశగా ప్రయాణించనుంది. ప్రస్తుతం సముద్రంలో ఏర్పిడిన ద్రోణి వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ద్రోణి ఎఫెక్ట్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీరాలను గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.
దీనికితోడు ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుంచి తెలంగాణ ప్రాంతంపై.. విదర్భ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల నుంచి వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు ద్రోణి బలపడి.. అల్పపీడనంగా మారే క్రమంలో.. ఏపీలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తెలంగాణలో వేడిగాలులు, ఏపీలో ఉరుములు, మెరుపులతో గాలులు, చల్లటి వాతావరణం ఉండనుంది. వీటన్నింటికీ తోడు క్యుములోనింబస్ ప్రభావం కూడా ఉండనున్నాయి.