అఫ్ఘనిస్తాన్ బ్యాంక్ సీఈవోగా హైదరాబాదీ

పరాయి దేశంలో మనుగడ సాగించడమే కాదు, పొరుగుదేశంలో సీఈవోగా ఎదిగాడు మరో హైదరాబాద్ వాసి. అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ)గా హైదరాబాద్ పాత బస్తీలోని చంచల్ గూడ్ కు చెందిన హఫీజ్ సయ్యద్ మూసా కలీం ఫలాహి ఎంపికయ్యారు. 

జమాతె ఇస్లామి హింద్ పూర్వ కార్యదర్శిగా మౌలానా సయ్యద్ యూసఫ్ కొడుకైన మూసా కలీంకు ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగంలో ముప్పై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ఖతర్, దుబాయ్, నూర్ ఇస్లామిక్ బ్యాంకుల్లో అత్యున్నత హోదాల్లో ఈయన విధులు నిర్వహించారు. 

దుబాయ్, నూర్ ఇస్లామిక్ బ్యాంక్ సంస్థల్లో 11ఏళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ రంగాల్లో ఆర్థిక నిపుణుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఈ బ్యాంక్ అఫ్ఘనిస్తాన్ దేశ మొత్తం ఉన్న 58శాఖాల్లో లావాదేవీలు జరుపుతోంది.