హైదరాబాద్ : తాను గెలిస్తే హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తాను
హైదరాబాద్ : తాను గెలిస్తే హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎంపీగా గెలిచాక ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తానన్నారు. ఎంపీగా గెలిచాక పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా దీనిపై చర్చకు తెరలేపుతానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు ఇచ్చినా రాష్ట్రంలో కొత్తగా ఒరిగేదేమీ లేదని రేవంత్ అన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
Read Also : ఎవరి ఆస్తి ఎంతంటే : కొండా విశ్వేశ్వరెడ్డి రూ. 895 కోట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ రెడ్డి.. లోక్ సభ బరిలోకి దిగారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రేసులో ఉండటంతో… ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి నిప్పులు చెరిగారు. కొడంగల్ లో చిత్తుచిత్తుగా ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి వచ్చి పోటీ చేస్తాడంట అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి డిపాజిట్ దక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్తపైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. మల్కాజ్ గిరిలో మా సత్తా ఏంటో చూపిస్తాం అని మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Read Also : అధికారంలోకి వస్తే : రూ.10వేలు పెన్షన్