మనమే తోపులం: IITలకే షాక్ ఇస్తున్న హైదరాబాద్ ట్రిపుల్ IT

  • Publish Date - April 17, 2019 / 08:03 AM IST

హైదరాబాద్ ఐఐఐటీ స్టూడెంట్లు ఐఐటీ మద్రాస్ విద్యార్థుల కంటే ఎక్కువ శాలరీలు సంపాదిస్తున్నారట. 2017-18 విద్యా సంవత్సరంలో భారతదేశ టాప్-38 కంటే తక్కువ ర్యాంకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరారు. అదే సంవత్సరం హైదరాబాద్ ఐఐఐటీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అర్హత సాధించి వారి కంటే ఎక్కువ జీతాలు వచ్చే జాబ్‌లు కొట్టేశారు. 

ఈ విషయాన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(ఎన్ఐఎఆర్ఎఫ్) ఏప్రిల్ 9న విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ఒక్కొక్కరు సంవత్సరానికి రూ.13.06లక్షల జీతం పొందితే, హైదరాబాద్ ఐఐఐటీ విద్యార్థులు కనీసం రూ.20.35లక్షల జీతంతో ఉద్యోగాల్లో చేరారు. ర్యాంకులు వారీగా దేశంలో మొత్తంలో ఉన్న ఐఐటీ కాలేజీల కంటే హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులే ఎక్కువ సంపాదిస్తున్నారు. 

ఐఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ పీజే నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఐఐఐటీ చదువు ఎప్పుడూ అన్నింటికంటే ఉన్నతస్థానంలోనే ఉంటుంది. ఫేస్‌బుక్, యాపిల్ వంటి సంస్థలు ఐఐటీలతో పాటు ఐఐఐటీ అర్హత ఉన్నవారిని తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మా విద్యార్థులు పరిశోధనాత్మకంగా సిద్ధమవుతుండటంతో వారిని తీసుకునేందుకు కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి’ అని తెలిపాడు. 

ఐఐటీ ఢిల్లీ స్టాఫ్ ఒకరు మాట్లాడుతూ.. ఐఐఐటీ హైదరాబాద్ కేవలం కంప్యూటర్ సైన్స్ మీదనే ధ్యాస పెడుతుంది అందుకే వారికి ఎక్కువ జీతాలు వస్తున్నాయి. అలాగే ఆ సంస్థ నుంచి ఎక్కువ జీతాలు ఇచ్చి ఉద్యోగాలిచ్చేందుకు పోటీ పడుతున్నాయి’ అని వెల్లడించాడు. 

ట్రెండింగ్ వార్తలు