ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దిశ ఘటనలో నిందితులపై జరిపిన ఎన్‌కౌంటర్‌కు తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ‘నేను వ్యక్తిగత ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌పై మెజిస్ట్రియల్ విచారణ జరగనుంది. ఇదంతా పోలీసుల పర్యవేక్షణలో ఉండగానే జరిగింది. ఎంపీలంతా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అజ్మల్ కసబ్ లాంటి వ్యక్తుల కేసులు వాయిదాపడుతూ ఉన్నాయి. ఈ కేసులో ఎందుకు అలా జరగలేదు’ అని ప్రశ్నించారు.
ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలోనే మీడియా మిత్రులతో మాట్లాడారు. డిసెంబరు 2నుంచి డిసెంబరు 12వరకూ కస్టడీలో ఉంచమని ఆదేశాలు వచ్చాయి. కేస్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా విచారణ కోసం షాద్ నగర్ ప్రాంతానికి తీసుకొచ్చారు.
అక్కడ నిందితులు ఫోన్‌తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు దాచిపెట్టినట్లు చెప్పారు. వాటిని సేకరించేందుకు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత కాసేపటి వరకూ తటపటాయించి పారిపోయే క్రమంలో నలుగురు చేరి గుంపుగా దాడి చేయడం మొదలుపెట్టారు.
రాళ్లు రువ్వుతూ.. పోలీసు రివాల్వర్ లాక్కొని దాడి చేయాలనుకున్నారు. చెన్నకేశవులు, మహ్మద్ పాషా ఆయుధాలు లాక్కున్నారు. వారికి 10మంది పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. కాసేపటి వరకూ జరిగిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు’ అని సీపీ సజ్జనార్ వెల్లడించారు.