తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ జరుపుతామని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పారు. విచారణ కమిటీ నిదేవిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై అనుమానం ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కు ఏప్రిల్ 25 వరకు గడువు ఉందన్నారు. అవసరమైతే మరో రెండు రోజులు పొడిగిస్తామని చెప్పారు.