మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు కలకలం రేగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫైళ్లను చెక్ చేస్తున్నారు.
మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు కలకలం రేగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులను చెక్ చేస్తున్నారు. అనూహ్యంగా దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరుగుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. సాగర్ సొసైటీలోని దిల్ రాజు ఆఫీస్ లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 5 బృందాలుగా ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. మహర్షి సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్.
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాకి బడ్జెట్ హద్దులు దాటిపోయిందని సమాచారం. దీంతో ఆదాయ వ్యయాల లెక్కలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు.. ఇన్ కమ్ ట్యాక్స్ పే చేశారా లేదా అనే దానిపై పరిశీలన చేస్తున్నారు. మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
ఇప్పటికే మహర్షి సినిమాకి సంబంధించి వివాదం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిందని చెబుతూ.. సినిమా థియేటర్ల యజమానులు మహర్షి సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచారు. ప్రసాద్ ఐమాక్స్ లో 138 రూపాయలున్న టికెట్ ధరను 200 రూపాయలకు పెంచారు. పెరిగిన ధరలు 2 వారాల పాటు అమల్లో ఉంటాయని చెప్పారు. అంతేకాదు అదనపు షోలు వేయడానికి కూడా డిసైడ్ అయ్యారు. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. టికెట్ల ధరలు పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఆ వివాదం మరువక ముందే.. ఇప్పుడు దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందించారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇలాంటి సోదాలు సహజమే అని ఆయన అన్నారు.