తెలంగాణ బరిలో జనసేన : ఆ 3 ఎంపీ స్థానాలే ఎందుకు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు

  • Publish Date - February 8, 2019 / 05:48 AM IST

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని… త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని… త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు.  3 పార్లమెంట్‌ స్థానాలకు.. కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ జనసేన ఎంచుకున్న ఆ మూడు పార్లమెంట్‌ స్థానాలేవీ? ఆ మూడునే ఎంచుకోవడం వెనుక దాగున్న ఆంతర్యమేంటి? పార్లమెంట్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలంగాణలో రాజకీయపార్టీలు అందుకు సిద్ధమవుతున్నాయి. ఎక్కువ స్థానాల్లో గెలవడం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. జనసేన పార్టీ కూడా తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. అన్ని స్థానాల్లో కాదు కానీ.. 3 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం కసరత్తు కూడా ఇప్పటికే ప్రారంభించింది. ఇప్పటికే 3 పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.

 

తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. జనసేనాని పూర్తిగా ఏపీలో పోటీపైనే దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలంగాణలోనూ పోటీ చేయాలని డిసైడ్‌ అయ్యారు. 3 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలుపనున్నారు. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, ఖమ్మం పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తామని జనసేనాని గతంలోనే ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. జనసేన కేవలం 3 స్థానాలను ఎంపిక చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. సికింద్రాబాద్‌ ఎంపీగా ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కొనసాగుతున్నారు. మల్కాజ్‌గిరి  ఎంపీగా మొన్నటి వరకు పనిచేసిన మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

 

ఇక ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొనసాగుతున్నారు. జనసేన ఎంచుకున్న మూడు ఎంపీ స్థానాల్లో .. ఒకరు బీజేపీ సిట్టింగ్ అభ్యర్థికాగా… మరో ఇద్దరు వలస పార్టీల నేతలే. దీంతో ఎలాగైనా ఈ 3 స్థానాలు కైవసం చేసుకోవాలనేది జనసేన వ్యూహం. ఈ 3 స్థానాలనే పవన్‌ ఎందుకు టార్గెట్‌ చేశారు, ప్రత్యేకంగా ఎందుకు దృష్టి సారించారు అన్నదానిపై చర్చ సాగుతోంది. ఈ 3 స్థానాలను ఎంచుకోవడం వెనుకు ఏదైనా రాజకీయ కోణం ఉందా.. లేక తెలంగాణలోని జనసేన కార్యకర్తలను సంతోష పెట్టేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.