తెలంగాణలో పోలింగ్ జోరుగా సాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి బూత్ లకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ప్రముఖులు అయితే ఉదయమే ఓటు వేసేందుకు తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. భార్య, తల్లితో వచ్చారు. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఓటు వేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే.. ప్రజాతీర్పు కావాలన్నారు సినీ స్టార్లు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. విధిగా ఓటు వేసిన తమ బాధ్యత నెరవేర్చాలని కోరారు అల్లు అర్జున్. ఓటు వేసినప్పుడే ప్రశ్నించే హక్కు కూడా వస్తుందని సూచించారు. హైదరాబాదీలు అందరూ కూడా విధిగా ఓటు వేసి.. తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఈ ఇద్దరు నటులు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.